IPL 2023: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..

by Vinod kumar |   ( Updated:2023-04-05 13:47:10.0  )
IPL 2023: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సంజూ కెప్టెన్సీలో రాజస్తాన్ రాయల్స్ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. మరో వైపు శిఖర్ సారథ్యంలోని పంజాబ్ టీమ్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తొంది. గౌహతి వేదికగా ఐపీఎల్‌లో జరగనున్న తొలి మ్యాచ్‌ ఇదే. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫేవరెట్‌గా నిలవనుంది. ఇప్పుడు ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇరు జట్లు విజయంతో..

ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 72 పరుగుల తేడాతో ఓడించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ కింగ్స్ ఏడు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది.

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI

శిఖర్ ధావన్(c), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), భానుక రాజపక్సే, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Advertisement

Next Story