- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2023 Qualifier 2: బ్యాడ్ న్యూస్.. క్వాలిఫయర్-2లో వర్షం ఎంట్రీ..

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. టాస్ వేయడానికి కొద్దిసేపటి ముందు వర్షం రావడంతో.. అంతా షాక్ గురయ్యారు. దీంతో వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం తగ్గగా.. 7:20 గంటలకు పిచ్ పరిశీలించినున్న అంపైర్లు టాస్, మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మే 28న సీఎస్‌కేతో ఫైనల్లో తలపడనుంది. మరి గుజరాత్ వరుసగా రెండోసారి ఫైనల్ ఆడుతుందా లేక ముంబై ఇండియన్స్ ఏడోసారి ఫైనల్‌కు చేరుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇరుజట్లు గతంలో మూడుసార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ రెండుసార్లు, గుజరాత్ టైటాన్స్ ఒకసారి నెగ్గాయి.
Next Story