- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: కేకేఆర్‌పై పంజాబ్ ఘన విజయం.. రస్సెల్ మెరుపులు వృధా
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిలిచిపోయింది. తిరిగి మ్యాచ్ నిర్వహించే అవకాశం లేకపోవడం డకవర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్లు మ్యాచ్ అఫిషియల్స్ ప్రకటించారు. కాగా, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది.
పంజాబ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేయగా.. రాజపక్సా (50) హాఫ్ సెంచరీతో రాణించారు. అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్‌ను తిరిగి కంటిన్యూ చేసే పరిస్థితి లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్లు అఫిషియల్స్ ప్రకటించారు.
కేకేఆర్‌లో ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ 34 పరుగులు చేయగా.. స్టార్ ఆల్ రౌండర్ రస్సెల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహయంతో 35 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో టీమిండియా యంగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ నిప్పులు చెరిగే బంతులతో మూడు ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. సామ్ కరాన్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.