IPL 2023: దలైలామాను కలిసిన పంజాబ్ జట్టు..

by Vinod kumar |   ( Updated:2023-05-19 13:05:24.0  )
IPL 2023: దలైలామాను కలిసిన పంజాబ్ జట్టు..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ధర్మశాల వేదికగా ఈ రోజు పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ జట్టు సభ్యులు బౌద్ధ మతగురువు దలైలామాను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సీజన్‌లో గబ్బర్‌ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ కాస్త ఆశలు రేపుతోంది. ఇప్పటికే 12 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. మరో 4 పాయింట్లు వస్తే నాకౌట్‌ దశకు చేరుకోవచ్చు. ఇందుకోసం మొదట దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించాలి. టార్గెట్‌ మిస్సైందా! ఇక ఎలిమినేట్‌ అవ్వాల్సిందే.

Advertisement

Next Story