- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: మరో బిగ్ ఫైట్.. నేడు చెన్నైతో బెంగళూర్ ఢీ..
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు వేదికగా చెన్నై, ఆర్సీబీ మధ్య మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాజస్థాన్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఓడిన చెన్నై.. బెంగళూరుపై గెలుపొంది.. మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది. మరోవైపు రెండు వరుస ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయాన్నందుకు ఆర్‌సీబీ జోరు మీద ఉంది. దాంతో ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండటంతో మరోసారి సిక్సర్ల వర్షం కురువనుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే దీపక్ చాహర్, బెన్ స్టోక్స్ గాయాలతో తుది జట్టుకు దూరంగా ఉండగా.. ఆ జాబితాలో కెప్టెన్ ధోనీ, సిసింద మగలా చేరాడు. ఈ ఇద్దరూ గాయాలతో బాధపడుతున్నట్లు సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ తెలిపాడు. ధోనీ సైతం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం కుంటుతూ కనిపించాడు. అతను మొకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ మగలా ఆర్‌సీబీతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ధోనీ ఆడటంపై మాత్రం సందేహాలు నెలకొన్నాయి. ఆర్‌సీబీతో మ్యాచ్ వరకు ధోనీ కోలుకుంటే బరిలోకి దిగుతాడు. లేదంటే బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే ధోనీ స్థానాన్ని భర్తీ చేసే వికెట్ కీపర్ జట్టులో లేకపోవడం చెన్నై టీమ్‌కు సమస్యగా మారింది. ఒకవేళ ధోనీ కోలుకోకపోతే.. అంబటి రాయుడుతో వికెట్ కీపింగ్ చేయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ధోనీ గైర్హాజరీలతో రవీంద్ర జడేజా జట్టును నడిపించే అవకాశాలున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (అంచనా):
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), వేన్ పార్నెల్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వైషాక్ విజయ్‌కుమార్, మహ్మద్ సిరాజ్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (అంచనా):
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (c & wk), మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, ఆకాష్ సింగ్, తుషార్ దేశ్‌పాండే
ఇవి కూడా చదవండి: