IPL 2023: ఐపీఎల్ నుంచి సన్‌రైజర్స్ ఔట్.. లక్నో గ్రాండ్ విక్టరీ

by Vinod kumar |   ( Updated:2023-05-13 14:36:46.0  )
IPL 2023: ఐపీఎల్ నుంచి సన్‌రైజర్స్ ఔట్.. లక్నో గ్రాండ్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.2 ఓవర్‌లో ఛేదించింది. లక్నో బ్యాటర్స్‌లో మన్కడ్ (64), స్టోయినిస్ (40), పూరన్ (44) పరుగులతో రాణించారు. నటరాజన్ వేసిన 19వ ఓవర్‌లో పూరన్ సిక్సర్ బాదడంతో లక్నో విజయానికి ఆఖరి ఓవర్‌లో 4 పరుగులే కావాల్సి వచ్చాయి. ఆఖరి ఓవర్ వేసిన ఫజల్ హక్ ఫరూకీ బౌలింగ్‌లో మొదటి బంతికి 2 పరుగులు రాగా తర్వాత బంతికి ఫోర్ ఇవ్వడంతో మ్యాచ్ ముగిసింది. సన్‌రైజర్స్‌ బౌలర్‌లో.. గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ చెరో వికెట్ తీశారు. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. మరోవైపు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకున్న లక్నో.. ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్‌లో 6 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్స్‌లో.. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (36), రాహుల్‌ త్రిపాఠి (20), మార్క్రమ్‌ (28), క్లాసెన్‌ (47), అబ్దుల్‌ సమత్‌ (37 నాటౌట్‌) రాణించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (0), అభిషేక్‌ శర్మ (7) విఫలమయ్యారు. కృనాల్ 2 వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, యుధ్వీర్ చెరో వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed