IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌..

by Vinod kumar |   ( Updated:2023-04-13 13:49:05.0  )
IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మొహాలి వేదికగా పంజాబ్‌ కింగ్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చివరి మ్యాచ్‌లో గుజరాత్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఓడింది. లాస్ట్ ఓవర్లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాది తమ జట్టును గెలిపించుకున్నాడు. అలాగే పంజాబ్ కూడా తమ చివరి మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. సన్‌రైజర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. కెప్టెన్ శిఖర్ ధవన్ (99 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కానీ, అంత భారీ లక్ష్యం కాకపోవడంతో సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. దీంతో చివరి మ్యాచ్‌లో ఓటములు చవిచూసిన ఈ రెండు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం కోసం పోరాడేందుకు రెడీ అయ్యాయి.

గత మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చిన యష్ దయాళ్‌కు గుజరాత్ విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో పంజాబ్‌లో కూడా కీలక బ్యాటర్ రిటర్న్ అవుతున్నాడు. మిడిల్, డెత్ ఓవర్లలో విధ్వంసం సృష్టించే లియామ్ లివింగ్‌స్టోన్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. అతను బౌలింగ్‌లో కూడా జట్టుకు సహాయపడే అవకాశం ఉంది. లివింగ్‌స్టోన్ వస్తే అతని కోసం జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజాను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. బౌలింగ్‌లో అయితే పంజాబ్ పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. అర్షదీప్ సింగ్ ఆ జట్టుకు కీలకంగా మారనున్నాడు.

పిచ్‌ కండిషన్‌..

మొహాలీ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. అదే సమయంలో బ్యాటర్లు కూడా కుదురుకుంటే భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. దీంతో పేస్ బౌలింగ్‌పై రెండు జట్లు ఫోకస్ పెట్టనున్నాయి. మొహాలి పిచ్‌ పెద్ద మైదానం.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కేఎల్‌ రాహుల్‌ ఇక్కడ పరుగుల వరద పారించాడు. డ్యూ ఫ్యాక్టర్‌ తక్కువే ఉంటుంది. కఠినమైన లైన్‌ అండ్‌ లెంగ్తుల్లో బంతులేస్తే బౌలర్లు వికెట్లు తీయొచ్చు.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (సి), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

శిఖర్ ధావన్ (సి), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ (WK), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్.

Advertisement

Next Story

Most Viewed