- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డ్.. ధోనీ, కోహ్లీలను దాటేసిన హిట్మ్యాన్
దిశ, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో 250 సిక్సర్ల బాదిన ఏకైక భారతీయ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. శనివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ ఫీట్ ను సాధించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 27 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 44 పరుగులు చేశాడు. అందులో 3 సిక్సర్లు కొట్టడం ద్వారా 250 సిక్సర్ల మైలురాయికి రోహిత్ చేరుకున్నాడు.
కాగా ఐపీఎల్ లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (357 సిక్స్లు)పై ఉండగా.. ఈ కేటాగిరీలో డివిలియర్స్ (251 సిక్స్లు) తర్వాత మూడో స్థానంలో రోహిత్ ఉన్నాడు. ఇక అత్యధిక సిక్స్ల కేటాగిరీలో భారత్ నుంచి రోహిత్ తర్వాత ధోనీ (235 సిక్స్లు), విరాట్ కోహ్లీ (229 సిక్స్లు) ఉన్నారు. ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు 233 మ్యాచులు ఆడిన హిట్ మ్యాన్.. 6,058 రన్స్ చేశాడు. అందులో ఓ సెంచరీ, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.