ముంబై పై చెన్నై ఘన విజయం..

by Mahesh |   ( Updated:2023-05-06 13:34:09.0  )
ముంబై పై చెన్నై ఘన విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై vs చెన్నై మధ్య జరిగిన 49వ మ్యాచ్ లో చెన్నై జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొదట్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకు చెన్నై బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 140 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు పవర్ ప్లేలో మంచి ఆరంభం దొరికింది. గైక్వాడ్ 30, కాన్వే 44, రహానే 21, దుబే 26 తో రాణించడంతో చెన్నై జట్టు ముంబై పై సునాయాసంగా గెలిచింది. దీంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.

Advertisement

Next Story