ముంబై గెలిస్తే పోటీలో నిలుస్తుంది

by Mahesh |   ( Updated:2023-05-12 09:10:28.0  )
ముంబై గెలిస్తే పోటీలో నిలుస్తుంది
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో ముంబై జట్టు ఫెలవమైన ఆట తీరుతో ఘోర పరాజయాలను ముటగట్టుకుంది. ఈ ఓటమిల నుంచి కోలుకుని వరుస విజయాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన ముంబై జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో టేబుల్ నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో ముంబై జట్టు ప్లే ఆఫ్ రేసులో కొనసాగాలి అంటే గుజరాత్ తో ఇవాళ జరిగే 57వ మ్యాచ్‌లో ముంబై కచ్చితంగా గెలవాల్సి ఉంది.

ఒకవేళ ఓటమి చెందితే.. ముంబై ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టతరంగా మారనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో ముంబై కచ్చితంగా గెలిచి తీరాల్సి ఉంది. అలాగే మరో పక్క ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే ఈ సీజన్ లో ప్లే ఆఫ్ చేరిన మొదటి జట్టుగా గుజరాత్ నిలువనుంది. ప్రస్తుతం GT జట్టు 11 మ్యాచుల్లో 8 గెలిచి 16 పాయింట్లతో టాప్ పోజిషన్‌లో ఉంది.

Also Read.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన చాహల్

Advertisement

Next Story