- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత!
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగనుంది. భారీగా ప్రేక్షకులు స్టేడియానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే స్టేడియం గేట్ నెంబర్ 4 వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గేట్ దగ్గర బారికేడ్లను తోసేసిన అభిమానులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ప్రేక్షకులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.
మ్యాచ్ టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని క్రికెట్ అభిమానుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇప్పటికే స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఉండటంతో పోలీసులు అదుపు చేయడంతో వారంతా వెనక్కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరి టికెట్ చూసి పోలీసులు స్టేడియం లోనికి పంపిస్తున్నారు. కాగా, ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి తలపడబోతున్నాయి. దీంతో భారీగా బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మ్యాచ్‌కు ముందే వరుస వివాదలు వస్తున్నాయి. కరెంట్ బిల్లు కట్టలేదని నిన్న అధికారులు స్టేడియంలో పవర్ కట్ చేశారు. తర్వాత ఇవాళ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనివ్వమని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన చేశారు.