- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ ఎత్తున ఐపీఎల్ ప్రసారాలు.. 25 చానల్స్ రెడీ
దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో క్రికెట్ అంటే ఒక మతం అని అందరూ అంటుంటారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అభిమానులు టీవీల ముందు కూర్చుండిపోతారు. టెస్టు మ్యాచ్‌లను కూడా వదలకుండా చూస్తున్న అభిమానులకు ఐపీఎల్ వచ్చిందంటే పండగే. క్రికెట్‌కు క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా అనేక వ్యూహాలు రచిస్తున్నది. 2021 సీజన్ కోసం 25 చానల్స్‌లో 8 భాషల్లో ప్రసారాలు అందించడానికి డిస్నీ స్టార్ ఇండియా ఏర్పాట్లు చేసింది. ముంబయిలోని తమ కేంద్ర కార్యాలయం నుంచి ఉద్యోగులు ఐదు వేదికల్లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన ప్రసారాల బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడం, మళయాలం, బెంగాళీ, మరాఠి భాషల్లో వ్యాఖ్యానం ప్రసారం చేయనున్నారు. రెగ్యులర్ స్పోర్ట్స్ చానల్స్‌తో పాటు స్టార్ డిస్నీ కిడ్స్ చానల్‌లో కూడా ఐపీఎల్ ప్రసారం కానున్నది. స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 1, తో పాటు ఇతర స్టార్ స్పోర్ట్స్ అన్ని చానల్స్‌లో ప్రసారాలు ఉంటాయి. వీటితో పాటు ప్రతీ ఆదివారం విజయ్ సూపర్, స్టార్ మా మూవీస్, స్టార్ సువర్ణ, స్టార్ జల్సా, స్టార్ పర్వాహ్, ఏసియా నెట్ చానల్స్‌లో ప్రాంతీయ భాషలో ప్రసారాలు ఉంటాయి. ఇక డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉండనున్నట్లు బ్రాడ్‌కాస్టర్ తెలిపింది.