- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనాపై పోరాటంలో విరాళాల వెల్లువ
దిశ, స్పోర్ట్స్: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ సమయానికి లభించడం లేదు. దీంతో విదేశాల నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆడుతున్న పలువురు క్రికెటర్ల తమ వంతు సహాయాన్ని ప్రకటిస్తున్నారు. పాట్ కమిన్స్, బ్రెట్ లీ, శ్రీవత్స్ గోస్వామి, సచిన్ టెండుల్కర్, రాజస్థాన్ రాయల్స్ ఆక్సిజన్ సరఫరాక కోసం భారీగా విరాళాలు ఇచ్చారు. తాజాగా పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కూడా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల కోసం భారీ విరాళం అందిస్తామని చెప్పింది. పంజాబ్ కింగ్స్ యాజమాన్యం సహా ఫ్రాంచైజీలో భాగస్వామ్యం కలిగిన రౌండ్ టేబుల్ ఇండియాతో కలసి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను భారీగా అందించడానికి నిర్ణయించామని చెప్పారు. మరోవైపు అదే జట్టులో సభ్యుడైన నికోలస్ పూరన్ కూడా తనకు వచ్చే ఐపీఎల్ జీతంలో కొంత మొత్తాన్ని ఆక్సిజన్ కోసం భారత ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక వీడియోను కూడా పోస్టు చేశాడు. వెస్టిండీస్‌కు చెందిన నికొలస్ పూరన్ భారత్‌ను ఆదుకోవడానికి మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.