యూకేలోనే ఐపీఎల్ నిర్వహించాలి : పీటర్సన్

by Shiva |
యూకేలోనే ఐపీఎల్ నిర్వహించాలి : పీటర్సన్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లను ఇంగ్లాండ్‌లోనే నిర్వహించాలని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందే కాకుండా టీ20 వరల్డ్ కప్‌ను కూడా యూఏఈలోనే జరపాలని అనుకుంటున్నారు. నా ఉద్దేశంలో ఐపీఎల్‌ను యూకేలో నిర్వహించడమే మంచిదని ఆయన అన్నారు.

టీ20 వరల్డ్ కప్ కోసం యూఏఈలో ఉన్న పిచ్‌లను తాజాగా ఉంచాలంటే ఐపీఎల్‌ను వేరే వేదికలో నిర్వహించడమే బెటర్ అయిన ఆయన అన్నారు. అలా చేయడం వల్ల యూఏఈ పిచ్‌లను యుద్దప్రాతిపదికన సిద్దం చేయాల్సిన అవసరం ఉండదన్నారు. అంతే కాకుడా యూకేలో ఐపీఎల్ నిర్వహించడం వల్ల లీగ్ మార్కెట్ మరింత విస్తృతమవుతుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story