- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాభాలు తెస్తున్న కరోనా ఓ వరం: గంగూలీ
దిశ, స్పోర్ట్స్ : కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకులతం అయిపోయింది. ఎంతో మంది ఉద్యోగాలు, జీవనోపాధి కోల్పోయారు. వ్యాపారాల్లో నష్టాలు.. వ్యవసాయంలో నష్టాలు ఇలా ఎటు చూసినా నష్టమే తప్ప లాభం ఎక్కడా కనపడ లేదు. అయితే బీసీసీఐకి మాత్రం కరోనా వల్ల లాభమే జరుగుతున్నదని బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంటున్నాడు. కరోనా ఒక వరం అని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మనుషుల ప్రాణాలను హరిస్తూ ఏడాదికి పైగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా.. ఇప్పుడు సెకెండ్ వేవ్ రూపంలో విజృంభిస్తున్నది. గతంలో కంటే తీవ్రత మరింతగా పెరిగిపోవడంతో పలు రాష్ట్రాల్లో తిరిగి లాక్‌డౌన్ పెడుతున్నారు. అంతే కాకుండా మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతండటంతో ముంబైలో నైట్ కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూ విధించారు. ఐపీఎల్‌కు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వాన్ని బీసీసీఐ కోరడంతో కేవలం ఆయా ఫ్రాంచైజీలకు రాత్రి సమయంలో స్టేడియం నుంచి హోటల్స్‌కు తిరగడానికి.. రాత్రి పూట ప్రాక్టీస్ చేయడానికి నిబంధనలు సడలించారు.
కరోనా కర్ఫ్యూ ఎలా వరం..?
క్రికెట్ మ్యాచ్ జరిగితే అక్కడకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని సందడి చేస్తుంటారు. అయితే కరోనా కారణంగా ప్రేక్షకులను అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో ప్రేక్షకులు స్టేడియం బయట సందడి చేశారు. పూణేలో జరిగిన మూడు మ్యాచ్‌ల సందర్భంగా టీమ్ ఇండియా అభిమానులు స్టేడియం బయటకు భారీగా తరలివచ్చారు. సమీపంలోని గుట్టపై ఎక్కి తమ క్రికెటర్లను చూసేందుకు ఎగబడ్డారు. స్వయంగా సచిన్ అభిమాని సుధీర్ కుమార్ ఒంటికి రంగులు పూసుకొని స్టేడియం సమీపంలోని గుట్టపై సందడి చేశాడు. దీంతో పూణే పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించడానికి నానా తిప్పలు పడ్డారు. ఇప్పుడు ముంబైలో మ్యాచ్‌లు జరుగుతున్నా ప్రేక్షకులు స్టేడియం దగ్గరకు రావడానికి భయపడుతున్నారు. రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ విధిస్తున్నారు. అలాగే శని, ఆదివారాల్లో ముంబైలో కర్ఫ్యూ కొనసాగుతున్నది. దీంతో అభిమానులు వాంఖడే దగ్గర సందడి చేయడానికి వీల్లేకుండా పోయింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఆటగాళ్ల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. కరోనా కర్ఫ్యూ వల్లే ఇదంతా సాకారం అవడంతో సౌరవ్ గంగూలీ దాన్ని వరం అని అన్నాడు.
పెరిగిన టీవీ ప్రేక్షకులు..
కరోనా కారణంగా కేవలం ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనధికార కర్ఫ్యూ నడుస్తున్నది. గతంలో కంటే త్వరగానే ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్ కావడంతో ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. దానికి తోడు ఇంటి వద్దనే ఉంటున్న వారి సంఖ్య పెరగడంతో గతలో కంటే ఐపీఎల్‌ను వీక్షించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇండియా-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జరిగిన సమయంలో హాట్‌స్టార్‌లో ఒక్కో మ్యాచ్‌ను 25 లక్షల నుంచి 30 లక్షల మంది వీక్షించారు. కానీ ఇప్పుడు ప్రతీ ఐపీఎల్ మ్యాచ్‌కు వీక్షకుల సంఖ్య 45 లక్షలు దాటిపోతున్నది. ఇక ముంబై జట్టు ఆడే మ్యాచ్‌లకు 50 లక్షలకు పైగా వీక్షణలు ఉంటున్నాయి. ఇదంతా కరోనా వల్లే సాధ్యమైందని బీసీసీఐ అధికారులు అంటున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. క్లోజ్డ్ డోర్స్‌లో నిర్వహిస్తున్న ఐపీఎల్ వల్ల బీసీసీఐతో పాటు స్టార్ ఇండియాకు లాభాలు వస్తున్నాయని తెలుస్తున్నది. నిన్న మొన్నటి వరకు ముంబై నుంచి మ్యాచ్‌లు తరలిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే షెడ్యూల్ ప్రకారమే ముంబైలో జరగాల్సిన మిగతా 8 మ్యాచ్‌లు కూడా జరుగుతాయని సౌరవ్ గంగూలీ స్పస్టం చేశారు.