ఐపీఎల్‌తో ప్రజల మూడ్ మారొచ్చు: గంభీర్

by Shiva |
ఐపీఎల్‌తో ప్రజల మూడ్ మారొచ్చు: గంభీర్
X

దిశ, స్పోర్ట్స్: కరోనా విలయతాండవంతో దేశ ప్రజలంతా ఒకలాంటి భయాందోళనతో ఉన్నారని, మానసికంగా చాలా కుంగిపోయారని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అయితే, ఐపీఎల్ వల్ల దేశ ప్రజల మానసిక స్థితి కాస్త కుదుటపడుతుందని ఆకాంక్షించారు. బీసీపీఐ నిర్వహిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ప్రజలకు సాంత్వన చేకూరుతుందని అన్నారు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన క్రికెట్ కనెక్టెడ్ అనే కార్యక్రమంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ యూఏఈలో జరుగుతుందా? ఇండియాలో జరుగుతుందా? అనేది ప్రస్తుతం అప్రస్తుతం. ముందు ఈ లీగ్ జరగడమే అందరికీ ముఖ్యం. ప్రజల దృష్టి ఆటలపై పడితే ఇప్పుడున్న దుస్థతి మారుతుందన్నారు. ఎవరు గెలుస్తున్నారు. ఎవరు ఓడుతున్నారు అనే పట్టింపుల కన్నా దేశ మానసిక స్థితి మారుతుంది. ఇప్పుడు నెలకొన్న భయాందోళనల దృష్ట్యా ఈ లీగ్‌ గతంలో జరిగిన లీగ్‌లకంటే గొప్పదవుతుంది. దేశానికి సాంత్వన చేకూరుస్తుంది’ అని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed