- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌కు సిద్ధంగా ఉండండి : చైర్మన్ పటేల్
దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్‌కప్ రద్దయిన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, సిబ్బంది సిద్ధం కావాలని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. వారం, పది రోజుల్లో ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేస్తామన్నారు. యూఏఈలో పూర్తి షెడ్యూల్ నిర్వహించడానికే ప్రయత్నిస్తున్నామని, ఏవైనా అవాంతాలు ఎదురైతే కుదించిన ఫార్మాట్‌తో లీగ్ నిర్వహిస్తామని బ్రిజేష్ స్పష్టం చేశారు. ఐపీఎల్‌పై స్పష్టత వచ్చినందున ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ‘ఆటగాళ్లకు కనీసం మూడు నుంచి నాలుగు వారాల శిక్షణ అవసరం. ఇందుకు అనుగుణంగానే ఐపీఎల్ షెడ్యూల్ ఉంటుంది. ఈ విషయమై గవర్నింగ్ బాడీ ఒకసారి స్పష్టత ఇవ్వగానే బీసీసీఐ షెడ్యూల్ ప్రకటిస్తుంది. యూఏఈలోనైనా ఇండియాలోనైనా మేం సిద్ధంగా ఉన్నాం’ అని బ్రిజేష్ పటేల్ పీటీఐకి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో అంపైర్లు, కామెంటేటర్లు, కోచ్‌లు, ఇతర సిబ్బంది విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సునీల్ గావస్కర్ వయస్సు 71ఏళ్లు. ఐపీఎల్ కామెంట్రీలో ఆయన చురుకుగా ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో గావస్కర్‌ను ఐపీఎల్ కోసం ఉపయోగించుకోవాలా వద్దా అనే మీమాంసలో బోర్డు ఉంది.