- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ వేలం ఎప్పుడంటే
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్‌కు సంబంధించిన మినీ వేలానికి ముహూర్తం ఖరారైంది. ఈ వేలం చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న నిర్వహించనున్నట్టు ఐపీఎల్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించింది. భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులు ఫిబ్రవరి 17తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే మినీ వేలాన్ని ఫిబ్రవరి 18న నిర్వహించినట్టు తెలుస్తోంది. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్‌కు సంబంధించిన ప్రక్రియ జనవరి 20తో ముగిసింది. దీంతో ఆయా ప్రాంచైజీలు తమ జట్టులో ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటున్నాయో, ఎవరిని వదిలేస్తున్నాయోనన్న వివరాలను ఇప్పటికే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు సమర్పించాయి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (10 మంది), కింగ్స్ ఎలెవన్ పంజాబ్(9 మంది) జట్లు ఎక్కువ మంది ఆటగాళ్లను రిలీజ్ చేయగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఐదుగురు) తక్కువ మందిని విడుదల చేసింది. ఈ రిటెన్షన్, రిలీజ్‌ల అనంతరం మొత్తం 55 మంది ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉండనున్నట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. వారి వివరాలను ఇప్పటికే సంబంధిత వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. అత్యధికంగా రూ.53.2 కోట్ల పర్స్ వాల్యూతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వేలంలో పాల్గొననుండగా, హైదరాబాద్, ముంబయి జట్ల పర్సు వాల్యూ అత్యల్పంగా రూ.10.75 కోట్లగా ఉంది.