- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూనియర్ కాలేజీల నుంచి ధరఖాస్తులకు ఆహ్వానం
దిశ, న్యూస్‌బ్యూరో: 2020-21 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి ప్రొవిజనల్ అఫిలియేషన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలని, ఆఫ్‌లైన్ పద్ధతిలో సమర్పించే దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురవుతాయని ఇంటర్ బోర్డు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కోర్సుల కొనసాగింపుతో పాటు అదనపు సెక్షన్ల కోసం కూడా నిర్ణీత ఫీజు చెల్లింపులతో దరఖాస్తులను సమర్పించాలని ఇంటర్ బోర్డు సూచించింది. సంబంధిత పత్రాలతో జూన్ 10 లోపు దరఖాస్తులను ఎలాంటి అదనపు రుసుం లేకుండా సమర్పించవచ్చని బోర్డు సూచించింది. రూ.వెయ్యి ఆలస్యపు ఫీజుతో జూన్ 17లోపు, రూ.3వేల రుసుంతో జూన్ 24లోపు, రూ.5వేల రుసుంతో జూలై 1లోపు, రూ.10వేల ఆలస్యపు ఫీజుతో జూలై 8లోపు దరఖాస్తులను సమర్పించాలని బోర్డు సూచించింది. జూలై 8 తర్వాత అందే దరఖాస్తులను ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, అనుమతులకంటే ముందే కోర్సులు నిర్వహించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు ప్రకటనలో స్పష్టం చేసింది.