'ప్యాకేజీ' తెచ్చిన శుభవార్త!

by Harish |
ప్యాకేజీ తెచ్చిన శుభవార్త!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ధాటికి విలవిల్లాడిన మార్కెట్లకు కాస్త ఊరట లభించింది. ప్రభుత్వాల నుంచి ఆర్థిక ఉద్దీపనల శుభవార్తలతో కాస్త కోలుకున్నాయి. సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ అతిపెద్ద సింగిల్ డే నష్టాలు నమోదు చేసిన తర్వాత బుధవారం లాభపడి మదుపర్ల సొమ్ము రూ. 6.64 లక్షల కోట్లను సాధించారు. సోమవారం మార్కెట్ మూలధనం రూ. 101.86 లక్షల కోట్లు ఉండగా బుధవారం మార్కెట్లు ముగిసే నాటికి రూ. 108.50 లక్షల కోట్లకు పెరిగింది. మూడురోజుల్లో సెన్సెక్స్ 2,533 పాయింట్లు, నిఫ్టీ 706 పాయింట్ల లాభాలను సాధించాయి. బుధవారం లాభాలతో సెన్సెక్స్ 2009 తర్వాత అతిపెద్ద సెషన్ లాభాలను నమోదు చేయడంతో పెట్టుబడిదారులకు రూ. 4.81 లక్షల కోట్లు సాధించగలిగారు.

మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థకు రెండు ట్రిలియన్ డాలర్ల సాయం అందించే ప్యాకేజీ అంశంలో సెనెట్ నాయకులు, వైట్‌హౌస్ మధ్య అవగాహన ఏర్పడటంతో మార్కెట్లకు బలం ఏర్పడింది. ఇదే సమయంలో భారత ప్రభుత్వం కీలకమైన ప్రకటనలు చేసింది. సామాన్యులకు, వ్యాపారులకు ప్రోత్సాహకాలు, ఊరటను ప్రకటించింది. దీనికితోడు త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయాలతో మార్కెట్లు లాభాల బాటపట్టాయి.

ఇక, ఇండియాలో కరోనా వ్యాప్తి గత వారం కంటే నెమ్మదించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ 568 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 4,22,829కి చేరుకుంది. ఇటలీలో అన్ని దేశాల కంటే అత్యధికంగా 6,820 మంది మరణించడం ఆశ్చర్యం. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, స్టాక్ మార్కెట్లపై అధిక ప్రభావాన్ని చూపిస్తోంది.

tags : Sensex, Nifty, BSE, US, India, Italy

Advertisement

Next Story

Most Viewed