- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనసుంటే మార్గాలెన్నో.. ‘సలాడ్స్’ బిజినెస్‌తో పూణె యువతి సక్సెస్ మంత్ర..
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు మొలకెత్తిన విత్తనాలను ఆరోగ్య పోషకులు తినే ఫుడ్‌గానే భావించేవాళ్లు. కానీ దాన్నే ఓ బిజినెస్‌గా మార్చుకోవచ్చనే ఆలోచన కొందరిని జీవితంలో సెటిల్ అయ్యేలా చేసింది. ఇలానే కొన్ని పచ్చి కూరగాయలు, పండ్ల ముక్కలతో చేసే ‘సలాడ్’ను ఇన్‌కమ్ సోర్స్‌గా ఎంచుకున్న పుణె యువతి.. స్థిరమైన ఆదాయాన్ని పొందుతోంది. రియల్ ఎస్టేట్ కంపెనీలో ఫుల్ టైమ్ వర్క్ చేసే మేఘ బఫ్నా.. సైడ్ ఇన్‌కమ్‌గా ‘కీప్ గుడ్‌షేప్’ పేరుతో సలాడ్ బిజినెస్ ప్రారంభించింది. ఈ ఫీల్డ్‌లో రూ.3500 పెట్టుబడితో మొదలైన తన జర్నీ.. నేడు నెలకు లక్షకు పైగా టర్నోవర్‌తో 30 మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది.
మేఘ.. కాలేజీ విద్యను కొనసాగిస్తూనే, ఉద్యోగం కూడా చేసేది. చాలామంది డబ్బు అవసరమై ఉద్యోగం చేస్తే తను మాత్రం ఆర్థిక స్వతంత్రం కోసం పనిచేసేది. ఆరోగ్య నియమాలు తూచ తప్పకుండా పాటించే తన లంచ్ బాక్స్‌లో సలాడ్స్ కచ్చితంగా ఉండేవి. ఈ క్రమంలో మేఘ తెచ్చిన సలాడ్స్‌ను కొలీగ్స్ అందరూ ఆస్వాదించేవారు. అంతేకాదు తమకు కూడా తెచ్చిపెట్టమని అడిగేవాళ్లు. మేఘ దీన్నే ఓ బిజినెస్ అవకాశంగా చూసింది. జంక్‌ఫుడ్ చాలా సులభంగా లభిస్తుంది. కానీ ఆరోగ్యకరమైన సలాడ్స్ మాత్రం ఎక్కడపడితే అక్కడ దొరకవన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని భర్తతో పాటు కుటుంబ సభ్యులకు వివరించింది. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్ల ముక్కలే మెనూగా కేవలం రూ. 3500 పెట్టుబడితో 2017లో సలాడ్ బిజినెస్ ప్రారంభించింది. వ్యాపారం కొనసాగే క్రమంలో ప్రతీ కొత్త ఆర్డర్‌తో ఆమెకు సవాళ్లు పెరుగుతూనే వచ్చాయి. కానీ ప్రతీ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు పోయింది.
కార్పొరేట్ ఉద్యోగాన్ని చేస్తూనే, ఈ బిజినెస్ కూడా కొనసాగించింది. ఉదయం 4 గంటలకు లేచి సలాడ్స్ ప్రిపేర్ చేయడంతో పాటు, తన కొడుకును పాఠశాలకు సిద్ధం చేసేది. అన్ని సలాడ్లు ప్యాక్ చేసి ఉద్యోగానికి వెళ్లేది. వ్యాపారం పుంజుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం ప్లాస్టిక్‌పై నిషేధం విధించడంతో ప్యాకింగ్ సమస్య ఏర్పడింది. తన ప్యాకింగ్ ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ఆర్డర్లు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే రీయూజబుల్ ప్లాస్టిక్ కంటైనర్లను వినియోగించాలనుకుంది. ఇవి కొంచెం ఖరీదైనప్పటికీ సలాడ్లు తాజాగా ఉండం ప్లస్ పాయింట్. ఈ మేరకు కోల్పోయిన కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్యాకేజింగ్‌తో సలాడ్స్ పంపి, తిరిగి వారి నమ్మకాన్ని పొందగలిగింది. నాలుగేళ్లలోనే వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో ప్రస్తుతం నెలకు 1.5 లక్షలు ఇన్‌కమ్ వస్తోంది. మొత్తంగా 27 రకాల సలాడ్లు అందిస్తోంది మేఘ.
‘నా కస్టమర్లకు ఎల్లప్పుడూ ఉత్తమ సేవలు అందిస్తాను. అమ్మకాలు పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ వారి నమ్మకమే ముఖ్యం. నాలుగేళ్లుగా అదే నాణ్యతతో కస్టమర్లకు అందించడమే నా విజయ రహస్యం’ అని మేఘ చెప్పింది.