- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిరివెన్నెల గురించి ఆసక్తికర విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే20న డా.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రి.. కాకినాడలో విద్యాభ్యాసం సాగగా.. ఆంధ్ర యూనిర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో సిరివెన్నెల కెరీర్ ప్రారంభించారు. చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘భరణి’ పేరుతో సీతారామశాస్త్రి కవితలు రాసేవారు. ఆయన రాసిన ‘గంగావతరణం’ అనే కవిత టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్ దృష్టికి వచ్చింది. దీంతో సిరివెన్నెల చిత్రంలో సీతారామశాస్త్రితో విశ్వనాథ్ పాటలు రాయించారు. సిరివెన్నెల సినిమాలో పాటలకు మంచి గుర్తింపు లభించింది.
అప్పటినుంచి సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ప్రసిద్ధి పొందారు. ఇప్పటివరకు ఆయన సుమారు 3వేలకుపైగా పాటలు రాశారు. 165 సినిమాలకు పాటలు రాయగా.. 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2019లో ఆయనకు పద్మశ్రీ దక్కింది. అలాగే గాయం సినిమాలో సిరివెన్నెల నటించారు.
ఇటీవల వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలకు సిరివెన్నెల పాటలు రాశారు. ‘RRR’ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రినే. తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పనిచేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు. రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీ, కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సిరివెన్నెలకు యోగి, రాజా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
- Tags
- kakinada