- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సివిల్స్ సాధించడం ఎలా..? వచ్చేనెల 28న విజేతలతో ముఖాముఖి
దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్ సర్వీసెస్లో విజయం సాధించడం ఎలా? అనే అంశంపై వచ్చే నెల 28వ తేదీ రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. బీసీ స్డడీ సర్కిల్ ఆధ్వర్యంలో విజేతలతో ప్రత్యేక ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తామని బీసీ వేల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్స్ రాసే అభ్యర్ధులు, ఆశావాహులు తప్పనిసరిగా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. వారిచే సూచనలు, సలహాలతో ప్రతీఒక్కరూ సివిల్స్ లో విజయం సాధించాలని ఆయన ఆకాక్షించారు. అయితే కష్టపడి చదివితే సత్ఫలితాలు రావడం ఖాయమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు గురికావొద్దని సూచించారు.
శ్రీజకు అభినందనలు
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించిన శ్రీజను బీసీ వేల్ఫేర్ సెక్రటరీ అభినందించారు. బుధవారం ఆయన ఛాంబరులో మర్యాదపూర్వకంగా కలసిన శ్రీజకు శుభాకాంక్షలు తెలిపారు. అతి చిన్న వయసులో మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంక్ సాధించడం సంతోషమన్నారు.
- Tags
- Civils