ఆమీ మోడీపై రెడ్‌కార్నర్ నోటీసులు

by vinod kumar |   ( Updated:2020-08-25 05:46:01.0  )
ఆమీ మోడీపై రెడ్‌కార్నర్ నోటీసులు
X

న్యూఢిల్లీ: నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌(పీఎన్‌బీ) నుంచి రుణాలను పొంది, మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ భార్య ఆమీ మోడీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులను జారీ చేసింది. భారత్‌లో ఆమెపై మనీ ల్యాండరింగ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ ఆమి మోడీకి మంగళవారం నోటీసులు జారీ చేసింది. కానీ, కొంత కాలంగా ఆమె ఆచూకీలో లేకుండా పోయారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ ఆమీ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

నీరవ్ మోడీ 30 మిలియన్ డాలర్లు వెచ్చించి న్యూయార్క్ నగరంలో ఆమి మోడీ పేరిట రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. పీఎన్‌బీ కేసులో భాగంగా నీరవ్ మోడీ విదేశాల్లోని రూ.637 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో న్యూయార్క్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఆ ఫ్లాట్లు ఆమీ మోడీ పేరిట ఉండటంతో ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసి, ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. చివరిసారిగా ఆమె అమెరికాలో ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆమీ మోడీ ఆచూకీలో లేకపోవడంతో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story