స్త్రీ లేకపోతే సృష్టేలేదు

by Shyam |
Sunita Reddy
X

దిశ, మెదక్: స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదని.. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని పురాణాలు సైతం చెపుతున్నాయని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ సునీతా రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా నేడు మహిళలు అన్నిరంగాల్లో ముందున్నారని తెలిపారు. వారి రక్షణ కోసం షీటీమ్‌లు, సఖిలాంటి కేంద్రాలు పెట్టి మహిళలకు భద్రత కల్పిస్తుందన్నారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్ రెడ్డి మాట్లాడుతూ.. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఆసరా ఫించన్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు అలరింపజేశాయి. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన మహిళలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా న్యాయసేవా సంస్థ సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఆశాలత, మహిళా కమీషన్ కార్యదర్శి రసూల్ బీ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మ, డీఈఓ రమేష్, ప్రముఖ అంకాలజిస్ట్ గీత, నాగమణి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed