- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్యాటక కేంద్రంగా విశాఖ
దిశ, ఏపీ బ్యూరో: విశాఖను పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ టూరిజం డే వేడుకలను ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడారు. తీరంలో బోటు షికారు, ఇతర ఆహ్లాద కార్యక్రమాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. మంత్రితో పాటు ఏపీటీడీసీ ఎండీ ప్రవీణ్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కలెక్టర్, ఎమ్మెల్యేలు, టూర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా కొండవీడు: సుచరిత
పర్యాటక కేంద్రంగా కొండవీడు కోటను అభివృద్ధి చేస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. చిన్ననాటి నుంచి కొండవీటి కొండను చూస్తూ పెరిగానని చెప్పారు. పైకి వెళ్ళడానికి సరైన దారి ఉండేది కాదన్నారు. ఇప్పుడు ఘాట్ నిర్మాణానికి శివారెడ్డి లాంటి వారు కృషి చేసినట్లు తెలిపారు.