- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలంపూర్ జోగులాంబ గుడిలో ఏం జరుగుతోంది..?
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అలంపూర్ జోగులాంబ మాత కొలువుదీరిన అలంపూర్ దేవాలయ అభివృద్ధికి.. పాలకుల నిర్లక్ష్యం, ఆలయ పాలక మండలి సభ్యులు, ప్రధాన అర్చకుల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు ఆటంకంగా మారాయి. దేశంలో అయిదవ శక్తిపీఠంగా జాతిని గడించిన అలంపూర్ దేవాలయ ప్రతిష్ట భంగం కలిగేలా అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ప్రతిరోజు అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యుల మధ్య జరుగుతున్న గొడవలు, ఆధిపత్య పోరుకు సంబంధించిన అంశాలు మీడియాలో వరుసగా వస్తుండడంతో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అటువంటి ఈ ఆలయ విశిష్టతను మరింతగా చాటవలసిన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అర్చకులు ఎవరికి వారుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఆలయ అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి. ఒకరు అవునంటే.. మరొకరు కాదని తీరుగా పట్టువిడుపు పోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తతంగం సాగుతున్నా.. ఉన్నతాధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, ఈ అంశంపై దృష్టి సారించకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.
రాజకీయాలే విభేదాలకు కారణం..
ప్రస్తుతము ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులకు మధ్య జరుగుతున్న ఆధిపత్యానికి ప్రధాన కారణం రాజకీయాలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఆలయంలో పని చేస్తున్న ఓ అర్చకునికి, ధర్మకర్తల మండలిలో స్థానం దక్కించుకున్న ఓ సభ్యుని మధ్య రాజకీయంగా విభేదాలు ఏర్పడ్డాయి. ఈ విభేదాలు వ్యక్తిగతంగా ఒకరికి ఒకరు విమర్శించుకునే స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఒకరి ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి మరొకరు ప్రయత్నించడం, ఈ క్రమంలోనే అనేక కథనాలు మీడియాలో రావడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఒక రకమైన నిర్ణయాలు తీసుకుంటే.. అర్చకులు మరో రకమైన నిర్ణయాలు తీసుకొని ఎవరికి వారు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వచ్చారు.
దీర్ఘకాలిక సెలవుల్లో ఈవో..
ఆలయంలో జరుగుతున్న తతంగంతో పాటు ఆలయానికి వివిధ రూపాలలో సమకూరుతున్న ఆదాయ వనరులకు సంబంధించి లెక్కలు చూడవలసిన సమయంలో ఈవో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అర్చకులు, మరోవైపు ధర్మకర్తల మండలి సభ్యులు లెక్కల విషయం తేల్చాలని పట్టుబట్టడం, అంతలోనే తనకు ఆరోగ్యం బాగాలేదని లెక్కలు తేల్చకుండానే ఈవో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. దీంతో ఆలయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇన్‌చార్జీ, ఈవోను నియమించింది.
అడిగేవారే లేరు..
ప్రతిరోజు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నా అక్కడ కనీసం ఒకరోజు బస చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో దర్శనం చేసుకొని వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకుల మధ్య ఉన్న వివాదాలను తొలగించి, ఆలయంలో రోజువారీ కార్యక్రమాలు సజావుగా సాగించడానికి, అభివృద్ధి పనులు చేపట్టడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాజకీయాలు తగవు..
వ్యక్తిగత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ కార్యక్రమాల విషయంలో రాజకీయాలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఆలయ ప్రతిష్టను కాపాడేందుకు మా వంతు కృషి మేము చేస్తూ ఉంటే అర్చక బృందం మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న అర్చకులకు మంత్రాలు చదవడం కూడా సరిగ్గా రాదు. వారికి తప్పకుండా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన తర్వాతనే అర్చకులుగా తీసుకోవాలి. -రవి ప్రకాష్ గౌడ్. ధర్మకర్తల మండలి చైర్మన్, జోగులాంబ దేవాలయం.
మేము ఇచ్చే సూచన ఒక్కటి పరిగణలోకి తీసుకోరు..
ఆలయంలో జరిగే కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించి మేము ఇచ్చే సలహాలు సూచనలను కమిటీ సభ్యులు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాల నిర్వహణలో పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పినా ఆలోచించరు. ఇక్కడ ఏం జరుగుతుందో ఉన్నతాధికారులు వచ్చి పరిశీలిస్తే నిజానిజాలు అన్నీ బయటపడుతాయి. -ఆనంద్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు, జోగులాంబ దేవాలయం.