గేమ్స్‌కు బానిసై ఇంటర్ విద్యార్థి మృతి

by srinivas |   ( Updated:2020-08-10 22:26:16.0  )
గేమ్స్‌కు బానిసై ఇంటర్ విద్యార్థి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: వీడియో గేమ్స్ కు బానిసై ఇంటర్ విద్యార్థి మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకతిరుమలకు చెందిన పవన్ అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతను వీడియో గేమ్స్ కు బానిసయ్యాడు. అలా అతను ఆ గేమ్స్ ఆడుతూ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అతడికి అప్పట్నుంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, నేడు అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story