- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత చార్జీల ప్రకారమే బస్సులు నడుస్తాయి..
దిశ, పటాన్ చెరు: కోవిడ్-19 వల్ల గత ఏడు నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసీ అంతరాష్ట్ర సర్వీసులను పున: ప్రారంభిస్తున్నట్టు డిపో మేనేజర్ ఇ.వి సత్యనారాయణ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెల్ డిపో నుండి విజయవాడ, గుంటూరు, కందుకూరు, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు గరుడ ప్లస్, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులు ప్రతిరోజూ నడుస్తాయని తెలిపారు. పాత చార్జీల ప్రకారమే బస్సులు నడుస్తాయని, చార్జీలు పెరగలేదని అన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఈ బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని తెలిపారు. వీటన్నింటికి వివిధ బస్ స్టేషన్లలో ఏటీబీ ఏజెంట్ల ద్వారా ముందస్తు రిజర్వేషన్లతో పాటు ఆన్ లైన్ రిజర్వేషన్ tsrtconline.in ద్వారా కూడా చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందన్నారు. అదేవిధంగా ఇదివరకే ప్రారంభమైన సిటీ , గ్రామీణ ప్రాంతాల్లో బస్సులతో పాటు అంతరాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభమైనందువల్ల పార్సిల్, కొరియర్ సర్వీసులు మరింత విస్తరించనున్నాయని చెప్పారు. ఏ ప్రాంతానికైనా 24 గంటల లోపే పార్సిల్, కొరియర్, కార్గో రవాణా చేస్తామని తెలిపారు. టు పే ద్వారా ముందుగానే డబ్బులు చెల్లించకుండా గమ్య స్థానంలో తీసుకునేటప్పుడు ఛార్జీలు చెల్లించే సదుపాయాన్ని కల్పించామని అన్నారు.