- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అండగా నిలిచేందుకు ఈ విధానం: హరీశ్ రావు
దిశ, మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్తకు ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పించిందని, పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇలా ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఆనంతసాగర్ గ్రామానికి చెందిన పోత రాజు అఖిల్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. అతను టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో ప్రమాద బీమా వర్తించింది. ఇందుకు సంబంధించి రూ. 2 లక్షల చెక్కును మంత్రి హరీష్ రావు మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్స్యూరెన్స్ చేసి రూ. 2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు సిద్ధిపేట నియోజకవర్గంలో గతంలో 18 మంది కార్యకర్తల కుటుంబాలకు ఈ ఇన్సూరెన్స్ చెక్కులు అందించామని, కొత్తగా మరొక కార్యకర్తకు బీమా మంజూరు అయింది అని మంత్రి చెప్పారు.