- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాలో ‘ప్రనౌన్స్’ ఫీచర్
దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్లకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తీసుకొస్తూ వారిని అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా ఇన్‌స్టా వినియోగదారులు తమ ప్రొఫైల్‌కు ‘ప్రనౌన్స్’ యాడ్ చేసే అవకాశం కల్పిస్తుంది.
ఇన్‌స్టా న్యూ ఫీచర్ సాయంతో యూజర్లు మొత్తంగా నాలుగు ‘ప్రనౌన్స్’ పెట్టుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే వినియోగదారులతో ప్రశంసలు అందుకుంటుండగా, వారిలో చాలామంది ఇప్పటికే వారి ప్రొఫైల్ బయోస్‌లో ప్రనౌన్స్ పెట్టుకున్నారు. ఈ ప్రొఫైల్ నేమ్ తమ ఫాలోవర్లకు మాత్రమే లేదా పబ్లిక్ అందరికీ కనిపించేలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది.
అయితే ఇన్‌స్టాగ్రామ్ అందించే జాబితాలో అందుబాటులో లేని ప్రనౌన్స్ జోడించడానికి ఒక ఫారమ్ నింపాలని ఇన్‌స్టా సూచించింది. ఇన్‌స్టాగ్రామ్ తన ప్లాట్‌ఫామ్‌లో చేర్చిన ఈ ఫీచర్ చిన్నదే కానీ ఎంతో ముఖ్యమైందని తెలిపింది. వినియోగదారులు ప్రనౌన్స్ వారి బయోస్‌లో భాగం చేయకుండా వారి ప్రొఫైల్‌లకు నేరుగా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీకు అందుబాటులోకి వస్తే.. ‘ఎడిట్ ప్రొఫైల్’ విభాగంలో న్యూ ప్రనౌన్స్ ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడ, మీకు కావలసిన సర్వనామాలను టైప్ చేయవచ్చు, అలాగే అందుబాటులో ఉన్న ఎంపికల జాబితా నుంచి ఇన్‌స్టాగ్రామ్ వాటిని సూచిస్తుంది.