- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్మా దానం చేసిన ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్
దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ పలువురి పౌరుల మన్ననలు అందుకుంటుంది. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకూ దాదాపు 1657 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. ఇదిలా ఉండగా, కొవిడ్ వారియర్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే, ఆయన కొవిడ్ నుంచి ఇటీవల కోలుకున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్నత్రిలో కొవిడ్ బాధితురాలికి గురువారం ఆయన ప్లాస్మాను దానం చేశారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. విధుల్లో భాగంగా సమాజంలో శాంతి భ్రతలను కల్పించడమే కాకుండా, ప్రజల ప్రాణాలను కాపాడటంలో సైబరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ప్లాస్మాను దానం చేసిన ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్‌ను సీపీ సజ్జనార్ అభినందించారు.