- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న.. ఆ సీఐ ఇళ్లు
దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్య ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసులు నమోదు చేశారు. ఇవాళ ఉదయం నుంచి సీఐ ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ విచారణలో దాదాపు రూ.10 కోట్లకు పైనే ఆస్తుల వివరాలను అధికారులు గుర్తించారు. ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న ఇన్స్ పెక్టర్ శంకరయ్య నివాసం, మూడంతస్తుల వరకూ ఏసీ పెట్టించాడని అధికారులు వెల్లడించారు. పార్కింగ్ నుంచి బాత్రూమ్ వరకూ మార్బుల్స్ వేయించాడని తెలిపారు. సెవెన్ స్టార్ హోటల్ రేంజ్‌లో సీఐ నివాసం నిర్మించాడని విచారణతో స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో శంకరయ్య ఆస్తులను అధికారులు గుర్తించారు. భవనాలు, పొలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వీస్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకూ అవినీతికి పాల్పడినట్టు తెలిపారు. నిన్న(గురువారం) రూ.లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ శంకరయ్య ఏసీబీ అధికారులకు చిక్కాడు.