- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలు.. పలు ఆస్పత్రులపై కేసు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జనాలు రోజూ వేల సంఖ్యలో మహమ్మారి బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల కోవిడ్ ఆస్పత్రుల్లో అవకతవకలు జరిగినట్టు పలు దినపత్రికల్లో వరుస కథనాలు సైతం వచ్చారు. దీంతో స్పందించిన అధికారులు, గురువారం ఏపీ వ్యాప్తంగా 35 కోవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. తొమ్మిది కోవిడ్ ఆస్పత్రుల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. అంతేగాకుండా.. రెమ్‌డెసివర్ ఇంజెక్షన్ల వినియోగంలో అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఆరోగ్య శ్రీ కింద కోవిడ్ బాధితులను యాజమాన్యాలు చేర్చుకోకపోగా.. కోవిడ్ బాధితుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఒక్కో పేషెంట్ నుంచి రోజుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళు చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆ ఆస్పత్రులపై 420, 188, 51బీ, 18మబీ, రెడ్‌విత్ 28బీ, 36సీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మూడు కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.