ఆధార్ వివరాలు ఏ రూపంలోనూ సేకరించొద్దు: హైకోర్టు

by Shyam |   ( Updated:2020-12-16 05:26:51.0  )
ఆధార్ వివరాలు ఏ రూపంలోనూ సేకరించొద్దు: హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ధరణి పోర్టల్‌‌లో ఆస్తుల వివరాల నమోదుపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ కోసం ఆధార్ వివరాలు అడుగుతున్నారని, గతంలో హైకోర్టు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఆధార్ వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కల్పించుకున్న ధర్మాసనం ఆధార్ వివరాలను ఏ రూపంలోనూ సేకరించొద్దని స్పష్టం చేసింది. ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగబోమన్న హామీని గుర్తు చేసింది. హామీని లిఖిత పూర్వకంగా సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ధరణి, రిజిస్ట్రేషన్ల అంశాన్ని మంత్రి వర్గ ఉప సంఘం సమగ్రంగా పరిశీలిస్తోందని ఏజీ న్యాయస్థానానికి వివరించారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed