అద్దెకు అద్భుతమైన ‘పెయింటింగ్స్’!

by Shyam |
Rent Paintings
X

దిశ, ఫీచర్స్: అవసరానికి కారు, బస్సు, విమానాలు అద్దెకు తీసుకోవచ్చు. పెళ్లికి వెళ్లేటపుడు డిజైనర్ దుస్తులు కూడా రెంట్‌కు తెచ్చుకోవచ్చు. ఇలా ఎన్నో వస్తువులను మన అవసరాలకు అనుగుణంగా రెంట్ పే చేసి వాడుకునే అవకాశం ఉంది. కానీ జపాన్‌లో ‘పెయింటింగ్స్’ అద్దెకిస్తారని తెలుసా? ఇది విచిత్రంగా ఉంది కదూ! సాధారణంగా కళాకృతులు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. చాలామంది వాటిని చూసి ముచ్చటపడతారు కానీ కొనుక్కులేరు. ఈ క్రమంలో కొంతకాలం పాటు పెయింటింగ్స్ లీజుకు ఇచ్చే వ్యాపారంతో ముందుకొచ్చారు జపనీయులు.

చిత్రకారులను, కళాభిమానులను సరికొత్త మార్గంలో కలిపే ఇన్నోవేటివ్ సర్వీస్‌గా ‘కాసి’ ప్రాచుర్యం పొందింది. పెయింటింగ్స్‌ను విక్రయించడానికి బదులుగా నెలకు కొంత ఫీజు చొప్పున లీజుకు ఇచ్చే అవకాశాన్ని అందిస్తోంది. ఈ మోడల్ దీర్ఘకాలంలో కళాకారులకు, క్లయింట్స్‌కు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుండగా, ఆదాయం కూడా బాగానే ఉంటుంది. మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పెయింటింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడో కొన్న పెయింటింగ్ గోడ మీద అలానే వేలాడుతుంటోంది.

కొత్తది కొనలేక, పాతది రిప్లేస్ చేయలేక అలాగే ఒదిలేస్తాం. ఈ క్రమంలోనే కాసీ వ్యవస్థాపకుడు షో ఫుజిమోటో తన వ్యక్తిగత అనుభవం ద్వారా ప్రేరణ పొంది ఈ వ్యాపార నమూనాను ఇంప్లిమెంట్ చేశాడు. కేవలం రెండేళ్లలోనే కాసికి ఆదరణ దక్కగా, ప్రస్తుతం ఆ కంపెనీ ప్రతి నెలా టర్నోవర్ 10 మిలియన్ యెన్ ($ 91,000) కంటే ఎక్కువ. అలాగే ఈ సర్వీస్ కారణంగా ఎంతోమంది జపనీస్ కొత్త కళాకారులు ఉపాధి పొందుతుండగా.. పాత ఆర్టిస్టులు తమ పెయింటింగ్స్ లీజుకు ఇచ్చి ఆర్థిక కష్టాలు తీర్చుకుంటున్నారు. ఇక తక్కువ ధరకే అందమైన చిత్ర రాజాలు అందుబాటులో ఉంచగా, యువ కళాకారులకు వారి భవిష్యత్తుపై మరింత నమ్మకాన్ని పెంచింది ఈ వ్యాపారం.

Advertisement

Next Story

Most Viewed