ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలి

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాలని టీ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సింబాలిక్ చర్యలు తీసుకోవడం కంటే పరిస్థితిని ఎదుర్కొవటానికి ఆచరణాత్మక విధానాన్ని అవలంభిచాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిలో గొలుసును విచ్ఛిన్నం చేయడానికి లాక్‌డౌన్ సహాయపడగా, సంక్షోభంపై పోరాడటానికి ప్రభుత్వం వ్యూహాత్మకమైన చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్-19 పరీక్షను నిర్వహించడానికి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ), సెంటర్ ఫర్ డీఎన్ఎ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)ను అనుమతించడానికి కేంద్రం అంగీకరించిందన్నారు.

Tags:coronavirus, hospital, ccmb,cdfd,congress,gudur narayana reddy,

Advertisement

Next Story

Most Viewed