- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఇన్ఫోసిస్!
దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వల్ల ఆగిపోయిన ఆర్థిక కార్యకలాపాల వల్ల అనే సంస్థలు నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ఐటీ రంగంపై భారీగా పడింది. ఈ నేపథ్యంలోనే ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో సీనియర్ ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్స్, డెలివరీ మేనేజర్ హోదాల్లో కొందరిపై ఈ వేటు పడనున్నట్టు తెలుస్తోంది. జేఎల్(జాబ్ లెవల్ ) 6,7,8 స్థాయిల్లో ఈ కోతలుండనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యయాన్ని తగ్గించుకునే అన్ని ప్రయత్నాలను ఇన్ఫోసిస్ వెతుకుతోంది. దేశీయంగా, విదేశీ మార్కెట్లలో క్షీణించిన వ్యాపార అవకాశాలు, ఆదాయ క్షీణత వల్ల మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని కంపెనీ భావిస్తోంది. కంపెనీలో జేఎల్ 7,8 శ్రేణిలో 13,000 మంది ఉద్యోగులుండగా, వీరిలో 1300 మంది ఉద్యోగాలను పోగొట్టుకునే ప్రమాదం ఉందని వినికిడి. మేనేజర్ల స్థాయి సీనియర్ల జీతాలు రూ. 35-40లక్షలపరిధిలోనూ, వైస్ ప్రెసిడెంట్లు, ఎస్‌వీపీలు, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అధిక వేతనాలను కంపెనీ చెల్లిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పునర్నిర్మాణం వల్ల ఖర్చులు తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. ఐదంచెలుగా ఉన్న వ్యవస్థను రెండంచెలుగా మార్చాలని ఇన్ఫోసిస్ చూస్తోందని సమాచారం. ఈ అంశంపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ.. ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలేవీ లేవని చెబుతున్నారు. వర్క్‌ఫోర్స్‌ను తగ్గించే ప్రణాళికలేవీ లేవని, పనితీరు ఆధారంగా ప్రతి ఏటా జరిగే సాధారణ ప్రక్రియలో భాగంగా చర్యలుంటాయని తెలిపారు.