కరోనాపై చెత్తపోస్ట్..ఇన్ఫోసిస్ ఉద్యోగి అరెస్ట్

by Sumithra |
కరోనాపై చెత్తపోస్ట్..ఇన్ఫోసిస్ ఉద్యోగి అరెస్ట్
X

దేశ ప్రజలు అసలే కరోనా అంటే భయపడుతుంటే కొందరు చదువుకున్నఅవివేకులు మాత్రం తమ పైశాచికం ప్రదర్శిస్తున్నారు. ఉన్నత చదువులు చదవటం, మంచి ఉద్యోగాలు చేస్తుండటంతో తాము గ్రేట్ అన్న భావనతో రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో చెత్తపోస్టులతో ప్రజల్లో మరింత భయాందోళనను రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కర్ణాటకలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన పోస్టు తీవ్ర కలకలం రేపుతోంది. బెంగుళూరులో ని ఇన్పోసిస్ సంస్థలో పని చేస్తున్న ఓ సాఫ్ఠ్ వేర్ ఇంజనీర్ ఇటీవల సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టాడు. ప్రజలారా బయట స్వేచ్ఛగా తిరగండి..తుమ్మండి..కరోనా వైరస్ వ్యాపింపజేయండి అంటూ అతను పెట్టిన ఫేస్ బుక్పోస్టు కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసుులు ఫేస్ బుక్ అకౌంట్ లోని వివరాల ఆధారంగా అరెస్టు చేశారు. దీంతో చాలా మంది నెటిజన్లు ఇన్ఫోసిన్ సంస్థపైనా తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ఇన్ఫోసిన్ యాజమాన్యం.. ఇలాంటి పోస్టులు చేయటం కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకమని ప్రకటించి అంతర్గత దర్యాప్తు జరిపించింది. తమ ఉద్యోగి పొరపాటుగా ఈపోస్టు చేయలేదని, ఉద్దేశ్యపూర్వకంగా చేశాడని తేల్చింది. ఇలాంటి చర్యలు తాము సహించబోమని ప్రకటిస్తూ అతడిని సంస్థ నుంచి తొలగిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.


Tags: Infosys employee layoff,social media,enquiry,cyber crime police case file

Advertisement

Next Story

Most Viewed