27 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ సీఈవో వేతనం!

by Harish |
27 శాతం పెరిగిన ఇన్ఫోసిస్ సీఈవో వేతనం!
X

దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ.46.12 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. బోనస్, ప్రోత్సాహకాలు, స్టాక్ యూనిట్స్ అన్నీ కలుపుకొని 27 శాతం పెరిగి రూ.46 కోట్లుగా ఉంది. ఈ మేరకు కంపెనీ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు కంపెనీ ఫామ్ 20ఎఫ్ దాఖలు చేసింది. దీని ప్రకారం…వేతనాల పెరుగుదలతో కంపెనీ లాభదాయకత తగ్గిందని, హెచ్1బీ వీసాల కోసం అధిక వ్యయాలు, క్రాస్ కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా ప్రభావం చూపించాయని ఇన్ఫోసిస్ తెలిపింది. కరోనా నేపథ్యంలో కొంతమంది క్లయింట్స్ రాయితీలు కోరుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు, రిటైల్, కన్స్యూమర్ గూడ్స్, ఇంధనం, తయారీ రంగాలపై కొవిడ్-19 ప్రభావం అధికంగా ఉందని, దీని వల్ల ఈ రంగ సంస్థలు ఐటీ వ్యయాలు తగ్గించుకోవాలని, కాంట్రాక్టులు రద్దు చేసుకునే అవకాశం ఉందని, ఈ ప్రభావం ఇన్ఫోసిస్ పైన ఉండవచ్చునని అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed