బ్రేకింగ్ : అమీర్ పేటలో బాంబ్ కలకలం

by Anukaran |
బ్రేకింగ్ : అమీర్ పేటలో బాంబ్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో బాంబ్ కలకలం సృష్టించింది. అమీర్ పేట మెట్రోస్టేషన్‌లో బాంబ్ పేరుతో అలజడి చెలరేగింది. దీంతో ఒక్కసారిగా నగర ప్రజలంతా ఉల్కిపడ్డారు. అయితే మెట్రోస్టేషన్ డస్ట్ బీన్‌లో ఎలక్ట్రానిక్ పరికరం వైబ్రేషన్ కావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యి వెంటనే 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు బాంబ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు మెట్రో స్టేషన్ మొత్తం తనిఖీలు చేపట్టారు. చివరకు డస్ట్ బిన్‌లో ఒక పని చేయని సెల్ ఫోన్‌ను అధికారులు గుర్తించారు. ఆ ఫోన్ పనిచేయకపోవడంతో దానిని చెత్తడబ్బాలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాంబు లేదని తెలియడంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story