- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అపరిచితులకు ఆశ్రయం ఇవ్వకండి.. పేరూరు పోలీసుల సూచన
by Shyam |
X
దిశ, వాజేడు: గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే ఆశ్రయం కల్పించవద్దని ములుగు జిల్లా పేరూరు ఎస్ఐ పోగుల శ్రీకాంత్ ఏజెన్సీ ఏరియా ప్రజలకు సూచించారు. ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి కొత్త టేకులగూడెం గ్రామాన్ని సందర్శించి, కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటినీ తనిఖీ చేసి, ఆధార్ కార్డులు పరిశీలించారు. కొత్త వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తెలియజేయాలన్నారు. అపరిచిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
Advertisement
- Tags
- Agency Area
- CRPF
Next Story