దుర్గమ్మకు రూ.4.36 కోట్ల ఆదాయం

by srinivas |
దుర్గమ్మకు రూ.4.36 కోట్ల ఆదాయం
X

దిశ, వెబ్‎డెస్క్ :
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానానికి రూ.4.36 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పైలా సోమినాయుడు స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయని.. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను నిర్వహించామని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాధారణ భక్తులు, భవానీ దీక్షాపరులు సహకరించారని అన్నారు.

మూలానక్షత్రం రోజున కొండచరియలు విరిగిపడిన ఘటనపై స్వయంగా పరిశీలించిన సీఎం జగన్.. దేవాలయ అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు మంజూరు చేశారని పైలా సోమినాయుడు తెలిపారు. దేవస్ధానానికి 85 వేల మంది ఆన్‎లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోగా.. వారిలో 35 వేల మంది దర్శనానికి రాలేకపోయారన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed