ఇందోరి రుహానికి శాంతి కలగాలి

by Shyam |
ఇందోరి రుహానికి శాంతి కలగాలి
X

దిశ, సిద్దిపేట: ప్రపంచ వ్యాప్తంగా అభిమాన హృదయాలను చూరగొన్న అంతర్జాతీయ ఉర్దూ షాయరీ రాహత్ ఇందోరి మరణం ఉర్దూ ప్రపంచానికి తీరనిలోటు అని మానవతా చిత్రకారులు రుస్తుం, ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం అన్నారు. అతని షాయరీ ప్రత్యేకమైన శైలితో శ్రోతలను ఉర్రూతలుగించేవారని, దేశభక్తి, ఆధ్యాత్మికం, సూఫీ తత్వంలో షేర్ షాయారీలు ప్రసిద్ధిగాంచినవన్నారు.

“సబీకా కూన్ షామిల్ యాంకి మిట్టీమే- కిసికే బాప్ కా హిందూస్తాన్ తొడీహై” లాంటి షాయేరితో ఐకమత్యాన్ని పెంపొందించే రచనలు ఎన్నో రసహృదయాలలో సుస్థిర స్థానం పదిలపరచుకున్నారని గుర్తు చేశారు. అతని రుహానికి శాంతికలగలని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మానవతా చిత్రకారులు రుస్తుం, ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబినారుస్తుం, తదితరులు సంతాపం తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed