అంతరించే జాతి చేతిలో ఆంథ్రోపాలజిస్ట్ హతం..

by Harish |
అంతరించే జాతి చేతిలో ఆంథ్రోపాలజిస్ట్ హతం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ వారి సంప్రదాయాలను, అలవాట్లను వదులుకోలేక.. చెట్లు, జంతువులతో సహవాసం చేస్తూ ఒక అనాగరిక జీవనాన్ని జీవిస్తూ సమాజంగా బతుకుతున్న ఆటవిక జాతులు ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్ని జాతులకు అభివృద్ధి చెందిన ప్రపంచం గురించి తెలుసు. అయినప్పటికీ వారు అభివృద్ధి చెందడానికి ముందుకురారు. కానీ కొన్ని జాతుల వారికి మాత్రం ఆధునిక జాతివారు అంటే కోపం. అలా అనడం కంటే వారికి తమ గోప్యత చాలా ముఖ్యం. వారి జీవితం వారే బతుకుతారు. బయటివాళ్లను దగ్గరికి కూడా రానివ్వరు. అమెజాన్ అడవిలో ఇలాంటి తెగలు ఎన్నో ఉన్నాయి. కానీ రోగాలకు, జబ్బులకు జాతి, మతం, తెగ అనే తేడాలు లేవు కదా.. అందుకే కొన్ని రోగాల బారినపడి ఈ ఆటవిక జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి. అలాంటి వారి గురించి పరిశోధించి కాపాడాలని ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అలా వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఓ పరిశోధకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిజానికి ఆ ఆటవికులే చంపేశారు.

రెయిలీ ఫ్రాన్సిస్కాటో.. ఒకే ప్రాంతానికి పరిమితమై ఉన్న తెగల గురించి అధ్యయనం చేసి, వారిని మానవజాతితో కలపాలని ప్రయత్నం చేసే ఓ ఆంథ్రోపాలజిస్ట్. బ్రెజిల్‌ దగ్గరి అడవిలో పరిశోధనలు చేస్తుంటాడు. బ్రెజిల్ ప్రభుత్వం నియమించిన ఫునాయ్ ఏజెన్సీ తరఫున ఆయన అక్కడి తెగల గురించి పరిశోధనలు చేస్తుంటారు. గత బుధవారం నాడు ఫ్రాన్సిస్కాటో తన బృందంతో కలిసి అడవిలో సెర్చ్ పార్టీ నిర్వహిస్తున్నాడు. అప్పుడు జరిగిన బాణాల దాడిలో ఆయన చనిపోయాడు. ఈ తెగను కాటారియో రివర్ తెగ అని పిలుస్తారు. కనిందే ఎథ్నో ఎన్విరాన్‌మెంటల్ డిఫెన్స్ అసోషియేషన్‌కు పంపిన రిపోర్టులో ఈ తెగ వారికి స్నేహితుడు ఎవరో, మిత్రుడు ఎవరో తెలుసుకునేంత తెలివి లేదని రెయిలీ ఫ్రాన్సిస్కాటో గతంతో పేర్కొన్నాడు. ఆ విషయం తెలిసి కూడా వాళ్ల దగ్గరగా వెళ్లడానికి ప్రభుత్వం అతనికి అనుమతి ఇచ్చింది. తాము సెర్చ్ పార్టీతో చెట్లు కొట్టినట్టుగా కనిపిస్తున్న ప్రాంతంలో వెతికినప్పుడు నలుగురు తెగ జాతీయులు బాణాలతో చేసిన దాడిలో రెయిలీ ఫ్రాన్సిస్కాటో మరణించినట్లు ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. 2018లో అండమాన్ నికోబార్ ద్వీపాల వద్ద సాధారణ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఓ తెగ వారు అమెరికా మిషనరీకి చెందిన జాన్ అలెన్ చావ్‌ను హత్య చేసి, బీచ్‌లో పడేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story