- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
57 శాతం పెరిగిన ఎగుమతులు
దిశ, వెబ్‌డెస్క్: ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాల వంటి రంగాల్లో ఎగుమతుల వృద్ధి కారణంగా మే నెలలో భారత ఎగుమతులు 56.94 శాతం పెరిగాయి. అయినప్పటికీ, సమీక్షించిన నెలలో భారత వాణిజ్య లోటు 99.61 శాతం పెరిగి 6.28 బిలియన్ డాలర్లు(రూ. 46 వేల కోట్లు)గా నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. గతేడాది ఇదే నేలలో వాణిజ్య లోటు 3.15 బిలియన్ డాలర్లు(రూ. 23.1 వేల కోట్లు)గా నమోదైంది. సమీక్షించిన నెలలో మొత్తం ఎగుమతులు(సరుకులు, సేవలు కలిపి) 98.29 బిలియన్ డాలర్లు(రూ. 7.2 లక్షల కోట్లు)గా ఉన్నాయి.
సమీక్షించిన కాలానికి దిగుమతులు 77.82 శాతం పెరిగి 104.14 బిలియన్ డాలర్లు(రూ. 7.6 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. అత్యధికంగా చమురు దిగుమతులు 171 శాతం పెరిగి 9.45 బిలియన్ డాలర్లు(రూ. 69.3 వేల కోట్లు)గా నమోదయ్యాయి. మే నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు 8.64 బిలియన్ డాలర్లు(రూ. 63.3 వేల కోట్లు), పెట్రోలియం ఉత్పత్తులు 5.33 బిలియన్ డాలర్లు(రూ. 39 వేల కోట్లు)గా నమోదయ్యాయి.