- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోలుకుంటున్న నిరుద్యోగ రేటు
దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థికవ్యవస్థ కరోనా ప్రభావం నుంచి కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియ ఎకానమీ(సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. తాజా గణాంకాల ప్రకారం.. జూన్ 13 నాటికి మొత్తం నిరుద్యోగ రేటు 13.6 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గింది. ఇందులో పట్టణ నిరుద్యోగ రేటు 14.4 శాతం నుంచి 9.7 శాతానికి, గ్రామీణ నిరుద్యోగ రేటు 13.3 శాతం నుంచి 8.2 శాతానికి చేరుకుంది. దేశీయంగా అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో రవాణా రంగం పుంజుకుంటోందని, ఆఫీసులు తెరుచుకుంటున్నాయని సీఎంఐఈ తెలిపింది.
గడిచిన కొన్ని వారాల్లో పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో విద్యుత్ వినియోగం పెరిగిందని పేర్కొంది. ‘వచ్చే నెల చివరి నాటికి లాక్‌డౌన్ నిబంధనలు చాలావరకు తగ్గిపోతాయి. మార్చి ముందు నాటి స్థాయికి పరిస్థితులు చేరుకుంటాయని, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో భారత్ వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని’ బ్లూమ్‌బర్గ్ ఆర్థికవేత్త అభిషేక్ గుప్తా చెప్పారు.