ఫ్లాష్.. ఫ్లాష్.. 21 ఏళ్ల తర్వాత రికార్డ్.. భారత్‌కు మిస్ యూనివర్స్‌ కిరీటం

by Anukaran |   ( Updated:2021-12-13 01:40:28.0  )
ఫ్లాష్.. ఫ్లాష్.. 21 ఏళ్ల తర్వాత రికార్డ్.. భారత్‌కు మిస్ యూనివర్స్‌ కిరీటం
X

దిశ, వెబ్‌డెస్క్ : 21 ఏళ్ల తర్వాత భారత్ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. పంజాబ్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుంది. 1994‌లో సుస్మితా సేన్ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకోగా, 2000లో లారాదత్తా, 2021‌లో హర్నాజ్ కౌర్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ఇజ్రాయిల్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటిల్లో భారత్‌కు చెందిన యువతి మిస్ యూనివర్స్ కిరీటం సాధించడంతో భారతీయులందరూ ఆనందంలో మునిగిపోయారు. మిస్ యూనివర్స్ కిరీటం భారత్‌కు రావడం ఇది మూడో సారి.

మిస్ యూనివర్స్ అందాల పోటిల్లో భారత్ ముద్దుగుమ్మ మెరిసి, దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్ చరిత్రను తిరగరాసింది. హర్నాజ్ కౌర్ సంధు 2000 మార్చి 3న చంఢీగడ్​లో జన్మించింది. ఓవైపు మాస్టర్స్ డిగ్రీ చేస్తూనే మరో వైపు మోడలింగ్‌ను ప్రారంభించింది. చిన్నతనం నుంచి మోడలింగ్ పై తనకున్న ఇష్టంతో మోడలింగ్‌లోకి వచ్చిన హర్నాజ్ ఇప్పటివరకు 2017లో టైమ్స్​ ఫ్రెష్​ ఫేస్​ మిస్​ చండీగఢ్​, 2018లో మిస్​ మ్యాక్స్​ ఎమర్జింగ్​ స్టార్​, 2019లో ఫెమినా మిస్​ ఇండియా పంజాబ్​, మిస్ దివా 2021, ఇప్పుడు 2021లో మిస్​ యూనివర్స్​ కిరీటాన్ని అందుకుంది. స్వతహాగా నటి అయిన ఈమె.. యారా దియాన్ పో బరన్, బై జీ కుట్టంగే అనే పంజాబీ సినిమాల్లోనూ కథానాయికగా నటించింది.

Bramhikhanda Akhanda Trailer New Funny Spoof

Advertisement

Next Story

Most Viewed