ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఇండియా!

by Harish |
ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఇండియా!
X

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అక్టోబర్ వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, నామినల్ జీడీపీ పరంగా ఫ్రాన్స్, యూకేలను అధిగమించి 2019లో ఇండియా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

ఇండియా ఆర్థిక వ్యవస్థ నామినల్ జీడీపీ 2.94 ట్రిలియన్ డాలర్లు. ‘ఇండియా ఆర్థిక వ్యవస్థ 2.94 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్దది. 2019లో యూకే, ఫ్రాన్స్‌లను అధిగమించి ఐదవ స్థానంలో ఇండియా నిలిచింది’ అని నివేదిక పేర్కొంది. యూకే ఆర్థిక వ్యవస్థ 2.83 ట్రిలియన్ డాలర్లను కలిగి ఉంటే, ఫ్రాన్స్ 2.71 ట్రిలియన్ డాలర్లను కలిగి ఉంది. 2010లో బ్రెజిల్, ఇటలీ లాంటి దేశాల కంటే వెనుకబడి 9వ స్థానంలో ఇండియా ఉండేదని నివేదిక తెలిపింది. ‘గడిచిన 25 సంవత్సరాల్లో ఇండియా ఎదుగుదల పెరిగింది. 1995 నుంచి దేశ నామినల్ జీడీపీ 700 శాతానికి పైగా పెరిగిందని నివేదిక వివరించింది.

కొనుగోలు శక్తి సమానత్వ నిబంధనలలో ఇండియా జీడీపీ 10.51 ట్రిలియన్లు. ఇది జపాన్, జర్మనీల కంటే అధికమని నివేదిక పేర్కొంది. అయితే, ఇండియా వాస్తవ జీడీపీ వృద్ధి గత మూడేళ్లుగా వరుసగా 7.5 శాతం నుంచి 4.5 శాతానికి పడిపోతోంది. 2019-20 రెండవ త్రైమాసికంలో దేశ జీడీపీ 4.5 శాతం పడిపోయింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 0.5 శాతం పాయింట్ల పతనం నమోదవడం గమనార్హం.

ప్రైవేటు వినియోగం, పెట్టుబడి, ఎగుమతుల మందగమనంతో సహా అనేక కారణాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. వస్తువులను ఉత్పత్తి చేయడానికి మార్కెట్లో తగినంత నగదు డిమాండ్ లేకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.

Read also..

ఇక నుంచి రియల్‌మీ స్మార్ట్‌టీవీల హవా!

Advertisement

Next Story

Most Viewed