- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తగ్గిన కరెంట్ ఖాతా మిగులు!
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ కరెంట్ ఖాతా మిగులు సుమారు రూ. 1.13 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో 2.4 శాతానికి సమానం. తొలి త్రైమాసికంలో రూ. 79 వేల కోట్లుగా ఉన్న వాణిజ్య లోటు రెండో త్రైమాసికంలో రూ. 1.08 లక్షల కోట్లకు పెరిగిన కారణంగానే కరెంట్ ఖాతా మిగులు తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో దేశ వాణిజ్య లోటు తగ్గింది. దీంతో వరుసగా మూడో త్రైమాసికంలో దేశ కరెంట్ ఖాతా మిగులు నమోదైంది.
దేశీయంగా రికవరీ బలంగా ఉండటంతో కరెంట్ అకౌంట్ మిగులు రెండొ అర్ధ సంవత్సరానికి రూ. 36.5 వేల కోట్లకు తగ్గే అవకాశముందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ప్రధాన విశ్లేషకులు అదితి నాయర్ చెప్పరు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం విధించిన ఆంక్షల వల్ల లాజిస్టిక్ సవాళ్లతో పాటు ఎగూంతుల్లో ఆటంకాలు ఎదురయ్యాయని వెల్లడించారు.